Sabitha Indra Reddy: తెలంగాణకు ఏమిచ్చారు.. ఏమిస్తరు.. చేవెళ్ల సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పగలరా?

Sabitha Indra Reddy Comments On Amit Shah
x

Sabitha Indra Reddy: తెలంగాణకు ఏమిచ్చారు.. ఏమిస్తరు.. చేవెళ్ల సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పగలరా?

Highlights

Sabitha Indra Reddy: కేసీఆర్‌ను తిట్టకుండా మీరేం చేశారో చెప్పగలరా

Sabitha Indra Reddy: చేవెళ్ల ఎమ్మెళ్యే క్యాంపు కార్యలయంలో మంత్రి సబితా మీడియా సమావేశం నిర్వహించారు. తొమ్మిదేండ్లలో బీజేపీ నాయకులు తెలంగాణకు ఏం చేశారని చేవెళ్లలో సభ పెడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అమిత్‌షా తెలంగాణకు ఎప్పుడు వచ్చినా రాష్ర్టానికి మేలు చేసే ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ గత తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్ల నేడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదు? రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను దేశమంతా అమలు చేస్తామని చేవెళ్ల సభలో చెప్పగలరా? మిషన్‌ భగీరథ లాంటి పథకంతో దేశంలోని ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నామని చెప్పగలరా? మిషన్‌ కాకతీయ వంటి పథకంతో దేశంలోని చెరువులు, కుంటలను బాగుచేశామని చెప్పగలరా? పల్లెప్రగతి లాంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నామని చెప్పగలరా?' అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories