రుణమాఫీ హామీని తెలంగాణ ప్రభుత్వం మరిచిందా?

Rythu Runamafi Scheme in Telangana | TS News
x

రుణమాఫీ హామీని తెలంగాణ ప్రభుత్వం మరిచిందా?

Highlights

*లక్ష రూపాయలు మాఫీ చేస్తానమి మ్యానిఫెస్టోలో వెల్లడి

TRS Government: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందా?. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఎప్పటి వరకు పూర్తి చేయనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది టీఆర్‌ఎస్. 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు. రుణమాఫీ నాలుగు విడుతల్లో ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలిపింది. అందులో భాగంగా ఇప్పటి వరకు రెండు విడుతలలో రుణమాఫీ చేశారు. 2020లో 25వేల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేసింది. మరోసారి 25 వేల నుంచి 50 వేల వరకు ఉన్న రుణాన్ని 2021 ఆగస్టులో మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో కొంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది..

ఇక రెండవ సారి 50వేల లోపు ఉన్న రైతుల రుణమాఫీ మొత్తం రైతులకు జరుగలేదు. అందుకోసం 1,790 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 25 వేల నుంచి 37 వేల వరకు ఉన్న రైతులకు 763 కోట్లు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంకా 1,027 కోట్ల నిధులు అందించి రుణమాఫీ చేయాల్సి ఉంది. అందులో 857 కోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల లోపు రుణాలు తీసుకున్న 2.96 లక్షల రైతులు ఉన్నారు. వారికి రుణమాఫీ కోసం 408.38 కోట్లు, 25 నుంచి 50 వేలు రుణాలు తీసుకున్న రైతులు 5.72 లక్షల మంది ఉన్నారు. వారికి 1,790 కోట్లు. 50 నుంచి 75 వేలు తీసుకున్న 7 లక్షల మంది రైతులకు 4 వేల కోట్లు. 75 నుంచి లక్ష వరకు తీసుకున్న 21 లక్షల మంది రైతులకు 13 వేల కోట్లు అవసరం.

ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి దాదాపు మూడేళ్లు గడిచింది. అయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణలో ఇప్పట్లో రుణమాఫీ నిధులు విడుదల చేయడం కష్టంగా మారింది. కేంద్రం సహకరించకపోతే రుణమాఫీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.


Show Full Article
Print Article
Next Story
More Stories