logo
తెలంగాణ

Karimnagar: రైతు బంధులో అక్రమాల పర్వం!

Rythu Bandhu Problems in Karimnagar | TS Live News
X

Karimnagar: రైతు బంధులో అక్రమాల పర్వం!

Highlights

Karimnagar: రైతు బంధు తీసుకుంటూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారనే విమర్శలు...

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరుపేద రైతులకు అందాల్సిన రైతు బంధు పక్కదారి పడుతోంది. దుక్కి దున్ని పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టించి పనిచేసే రైతులకు అందాల్సిన సహాయం రియల్టర్లు చేతిలోకి వెళుతుంది. కరీంనగర్ జిల్లాలో గత కొంత కాలంగా రియల్ వ్యాపారం మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతోంది. చాలా చోట్ల పంట పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలోని గ్రామాల్లో సైతం లే అవుట్లు వెలిశాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని వరి పొలాలను ఎకరాల చొప్పున కొనుగోలు చేసి ప్లాట్స్ గా చేసి గజాల చొప్పున అమ్ముతున్నారు. అయితే వ్యవసాయ భూములను వెంచర్లు చేసి అమ్మకాలు జరిపి కూడా వ్యవసాయేతర భూములుగా మార్చకుండా రెవిన్యూ రికార్డ్‌ల్లో అలానే కొనసాగిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వెలుగులోకి వచ్చింది. ప్లాట్ లు చేసి అమ్మిన భూములకు కూడా సాగు పెట్టుబడి సాయం కింద రైతు బంధు తీసుకుంటూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యవసాయేతర భూములుగా అమ్మి కూడా రెవిన్యూ రికార్డ్స్‌లో మార్చకుండా ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు కాజేస్తునన వైనంపై ఆయా ప్రాంతాల్లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వాస్తవానికి వ్యవసాయం చేసే భూమిని కమర్షియల్ భూములుగా మార్చాలంటే నాలా కన్వర్షన్ తీసుకోవాలి. రియల్ వ్యాపారం చేయాలంటే DTCPకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిగానే రియల్ ఎస్టేట్ వెంచర్‌ను చూపిస్తూ కోట్ల రూపాయలు రైతు బంధు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్, జగిత్యాల జిల్లాలోని చాలా గ్రామాల్లో ఉన్న భూమికి, వేములవాడ మండలంలోని కొన్ని గ్రామాలు, పెద్దపల్లి జిల్లాలోని పెద్ద కల్వలలో ఉన్న రియల్ వెంచర్లును.. ఇంకా వ్యవసాయ భూములుగానే చూపిస్తూ సాగు సాయం పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. రియల్ వెంచర్లు వేసి కూడా లక్షల్లో పెట్టుబడి సాయం తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వ్యక్తం అవుతున్నాయి. బయట పడినవి కొన్నే అయినా ఇంకా బయటకు రాని జాబితాలు చాలా ఉన్నాయని అధికారులు గుర్తించారు

Web TitleRythu Bandhu Problems in Karimnagar | TS Live News
Next Story