Rythu Bandhu: ఇవాళ్టి నుంచి తెలంగాణలో రైతుబంధు పంపిణీ

Rythu Bandhu: ఇవాళ్టి నుంచి తెలంగాణలో రైతుబంధు పంపిణీ
Rythu Bandhu: 68.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
Rythu Bandhu: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్‌కు రైతు బంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.10 లక్షలుగా ప్రభుత్వం లెక్క తేల్చింది. కొత్తగా భూములు రిజిస్ట్రేషన్స్ అయిన వారికి కూడా రైతు బంధు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. విడతల వారీగా జమ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. గత సీజన్‌తో పోల్చితే లబ్ధిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఈ సీజన్‌లో రైతుబంధు పంపిణీ కోసం 7వేల 521.80 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెలిపింది. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతు బంధు జమ చేయనున్నది. రాష్ట్రంలో ఎకరం పొలం ఉన్న రైతులు 19.98 లక్షల మంది ఉన్నారు. వీరి ఖాతాల్లో ఇవాళ 586.65 కోట్లు జమ కానున్నాయి.
రైతులకు ప్రతీ ఏడాది ఖరీఫ్, రబీ కాలాల్లో పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 10వేలు అందిస్తుంది. ఖరీఫ్‌కు ఎకరాకు 5వేలు, రబీ సీజన్‌కు ఎకరాకు 5వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదిలా ఉంటే గత సీజన్‌తో పోల్చితే ఈసారి 3.64 లక్షల మందికి పైగా రైతులకు కొత్తగా రైతుబంధు అందనున్నది. సుమారు 1.5 లక్షల ఎకరాల భూమి కొత్తగా జాబితాలో చేరింది. భూముల క్రయవిక్రయాలు, బదలాయింపు, కోర్టు కేసుల పరిష్కారాలు, వివాదంలోని పార్ట్-బీ జాబితాలోని భూ సమస్యల పరిష్కారం వంటి కారణాలతో రైతుల సంఖ్యతో పాటు భూమి కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 63 లక్షల మంది రైతులకు చెందిన 1.48 కోట్ల ఎకరాలకు 7వేల 411.52 కోట్లు అందింది.
మరోవైపు ఇప్పటికే 50 వేల లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. 50 వేల రూపాయలు పైన ఉన్న వారి డబ్బులను రుణమాఫీ చేయలేదు. దీంతో రైతు బంధు జమా కాగానే బ్యాంకులు కట్ చేసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం SLBC అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.
సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
గణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMTరైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!
18 Aug 2022 3:00 PM GMT