ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం..బస్‌ భవన్‌ ముట్టడించిన విద్యార్థీ, లెఫ్ట్‌ పార్టీల నేతలు

ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం..బస్‌ భవన్‌ ముట్టడించిన విద్యార్థీ, లెఫ్ట్‌ పార్టీల నేతలు
x
Highlights

హైదరాబాద్‌లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇవాళ విద్యార్థీ సంఘాల నాయకులు రోడ్డెక్కారు. PDSU, SFI, AISF, TVV...

హైదరాబాద్‌లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇవాళ విద్యార్థీ సంఘాల నాయకులు రోడ్డెక్కారు. PDSU, SFI, AISF, TVV సంఘాలకు చెందిన విద్యార్థులు లెఫ్ట్‌ పార్టీల నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌ భవన్‌ను ముట్టడించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్‌ చేశారు.

ఇటు మంత్రుల నివాసాల ముట్టడికి బయల్దేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను ఓయూ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను నెరవేర్చాలని విద్యార్థీ నాయకులు డిమాండ్‌ చేశారు. సమ్మె ముగిసే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories