Sajjanar: రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదు.. యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయి

RTC Rental Bus Owners Meeting With RTC MD Is Success
x

Sajjanar: రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదు.. యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయి

Highlights

Sajjanar: సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది

Sajjanar: అద్దె బస్సు యజమానులతో TS ఆర్టీసీ చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. అద్దె బస్సులు యథావిథిగా నడుస్తాయని తెలిపారు. కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వారం రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని పేర్కొన్నారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులను కూడా తిప్పుతామని సజ్జనార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories