ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలేమీ లేవు.. హై కోర్టుకు అఫిడవిట్లు సమర్పించిన అధికారులు

ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలేమీ లేవు.. హై కోర్టుకు అఫిడవిట్లు సమర్పించిన అధికారులు
x
Highlights

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ మరోసారి కౌంటర్ దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కంటే 867 కోట్లు...

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ మరోసారి కౌంటర్ దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కంటే 867 కోట్లు ఎక్కువే వచ్చాయని సునీల్ శర్మ హైకోర్టుకు నివేదించారు. వేర్వేరు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు. రుణ పద్దు కింద విడుదలైన నిధులను, వడ్డీని ప్రభుత్వం ఎన్నడూ అడగలేదన్నారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాలని చెప్పిన 14వందల 42కోట్లను చట్టప్రకారం రీఎంబర్స్‌మెంట్ కోరడమే తప్ప డిమాండ్ చేయలేమని సునీల్ శర్మ తెలిపారు. ఇక, 2018-19లో అయితే ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎలాంటి బాకీ లేదన్నారు. అయితే, ఇంతకుముందు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో రేపటి విచారణలో ఎలా రియాక్టవుతుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories