ప్రభుత్వాని షాక్... అక్టోబర్ 5 నుంచి ఆగనున్న ప్రగతి రథచక్రాలు

ప్రభుత్వాని షాక్... అక్టోబర్ 5 నుంచి ఆగనున్న ప్రగతి రథచక్రాలు
x
Highlights

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించారు. అక్టోబర్ ఐదు నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈనెల 3న సమ్మె దిగుతున్నట్లు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పంధించ లేదని పేర్కొన్నారు.

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించారు. అక్టోబర్ ఐదు నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈనెల 3న సమ్మె దిగుతున్నట్లు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పంధించ లేదని పేర్కొన్నారు. ఆర్టీసీలో నష్టాలకు తాము కారణం కాదని తెలిపారు. తెలంగాణ అవిర్భావం అనంతరం ప్రభుత్వం నుంచి 2800కోట్లు రావాల్సింది కానీ ప్రభుత్వం 700 కోట్లు రూపాయిలు ఇచ్చి తప్పుకుందని తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసమే తాము సమ్మె చేస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. దసరా సందర్భంగా సమ్మె ప్రకటిస్తే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories