గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ఉదయం డిపోకు వచ్చి కుప్పకూలిపోయిన డ్రైవర్

RTC Driver Expired with Heart Attack At Mahabubabad Bus Depo | Telangana News
x

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ఉదయం డిపోకు వచ్చి కుప్పకూలిపోయిన డ్రైవర్

Highlights

RTC Driver: ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించిన డ్రైవర్...

RTC Driver: మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న పారేటి జనార్దన్ గుండెపోటుతో బస్సులోనే మరణించిన సంఘటన అందరిని కలిచివేసింది. ఉదయాన్నే డిపోకు చేరుకుని రిజిస్టర్‌లో సంతకం చేశారు. అనంతరం సూర్యాపేట డ్యూటికి వెళ్ళడానికి బస్సు స్టార్ట్ చేయబోగా ఛాతినొప్పితో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సహచరులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో డిపోలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories