Nalgonda: ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Nalgonda: ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై శీను నాయక్, తండ్రి మృతి...

Shireesha
Updated on: 2 Jan 2022 8:16 AM IST
RTC Bus Hit a Auto Killed 2 Members in Nalgonda District | Telangana News Today
X

Nalgonda: ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Nalgonda: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఎస్సై సహా ఆయన తండ్రి మృతి చెందారు. చింతపల్లి మండలం మాల్ దగ్గర.. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను వికారాబాద్ ఎస్సై శ్రీను నాయక్, ఆయన తండ్రిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు.. ఎస్సై శ్రీను నాయక్‌కి వారం రోజుల కిందటే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సై శ్రీనుది రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్య తండా కాగా.. ఓ ఫంక్షన్‌కి హాజరై తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ఎస్సై, ఆయన తండ్రి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై శ్రీను మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Shireesha

Shireesha

Next Story