Rohit Vemula: పోలీసుల 'క్లోజర్ రిపోర్ట్'లో ఏముంది? దీనిపై విద్యార్థులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

Rohit Vemula Here is all about Closure report
x

Rohit Vemula: పోలీసుల 'క్లోజర్ రిపోర్ట్'లో ఏముంది? దీనిపై విద్యార్థులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

Highlights

Rohit Vemula: పోలీసుల 'క్లోజర్ రిపోర్ట్'లో ఏముంది? దీనిపై విద్యార్థులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

Rohit Vemula: రోహిత్ వేముల కేసు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. రోహిత్‌ ఆత్మహత్యకు వేరొకరు కారణమని చెప్పే సాక్ష్యాలేమీ లభించలేదని, ఈ కేసును క్లోజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పోలీసులు ‘క్లోజర్ రిపోర్టు’ ఫైల్ చేయడంతో ఈ వివాదం మరోసారి భగ్గుమంది.

క్లోజర్ రిపోర్టులో చాలా అంశాలు ఈ వివాదంలో మరింత అగ్గిని రాజేశాయి. అసలు రోహిత్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) కులానికి చెందినవాడు కాదని కూడా తమ పరిశీలనలో తేలినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. తాజా పరిణామాల నడుమ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిరసనలు పెల్లుబికాయి. మరోవైపు రాజకీయంగానూ ఈ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసలు ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది, పోలీసులు ఏం అంటున్నారు, రోహిత్ బంధువులు ఏం చెబుతున్నారు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఏం అంటున్నాయి? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వివాదం ఎలా మొదలైంది?


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ చేసే రోహిత్ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యకు ముందుగా రోహిత్‌ను హాస్టల్ నుంచి నాటి వైస్ చాన్సెలర్ (వీసీ) అప్పారావు రస్టికేట్ చేశారు. రోహిత్‌పాటు ఐదు మంది విద్యార్థులను క్యాంపస్‌లో కొన్ని ప్రాంతాల్లో అడుగుపెట్టొద్దని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీనికి ముందుగా కొన్ని ఆందోళనల్లో రోహిత్ పాలుపంచుకోవడంపై అప్పటి కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీ ఇరానీకి బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఆ తర్వాత రోహిత్ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారు. రోహిత్ ఆత్మహత్య అనంతరం బీజేపీ నాయకత్వం, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలకు వ్యతిరేకంగా భారీగా నిరసనలు చెలరేగాయి. దేశంలోని భిన్న యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.

నిందితులుగా ఎవరెవరి పేర్లు?

నిరసనల నడుమ రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నాటి వీసీ అప్పారావు, నాటి ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ నాయకుడు రామచంద్రరావులతోపాటు కొందరు ఏబీవీపీ నాయకుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు జరుగుతున్నాయని, వీటిని తట్టుకోలేకే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది.

పోలీసులు ఇంతకీ ఏం తేల్చారు?


అందరూ చెబుతున్నట్లుగా రోహిత్ వేముల ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని క్లోజర్ రిపోర్టులో తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. ‘‘దళిత హక్కుల కోసం పోరాడే అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో తన కార్యకలాపాలు, నిరసనల వల్ల రోహిత్ సరిగ్గా చదువుపై శ్రద్ధ పెట్టేవాడు కాదు. దీంతో ఆయనపై మానసికంగా చాలా ఒత్తిడి ఉండేది’’ అని రిపోర్టులో ఆరోపించారు.

‘‘మరోవైపు రోహిత్ కోసం ఆయన తల్లి ఒక ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ సృష్టించారు. ఈ విషయం ఎప్పుడు బయటపడుతుందోనని కూడా రోహిత్ ఆందోళన పడేవాడు. ఒకవేళ తన కులం సంగతి బయటపడితే, యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తారేమోనని భయపడేవాడు’’ అని రిపోర్టులో పేర్కొన్నారు.

మొత్తానికి రోహిత్ ఆత్మహత్యకు వేరొకరు కారణమని ఎలాంటి సాక్ష్యాలూ లభించలేదని, ఈ కేసును మూసివేసేందుకు అనుమతించాలని కోర్టు ఎదుట పోలీసులు కోరారు.

రోహిత్ కుటుంబం ఏం చెబుతోంది?


క్లోజర్ రిపోర్టులో అసలు తన కుమారుడు దళితుడే కాదని పోలీసులు పేర్కొనడం పచ్చి అబద్ధమని రోహిత్ తల్లి రాధిక వేముల వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. తన కుమారుడికి న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని ఆమె అన్నారు.

‘‘సరిగ్గా చదువుకోలేక పోవడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడంలో నిజంలేదు. చదువులో తను ముందంజలో ఉండేవాడు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లోనూ తను పాస్ అయ్యాడు’’ అని రాధిక అన్నారు.

అసలు తన కొడుకు దళితుడు కాదని పోలీసులు ఎలా చెబుతున్నారో సాక్ష్యాధారాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. నిరసనల నడుమ రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నాటి వీసీ అప్పారావు, నాటి ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ నాయకుడు రామచంద్రరావులతోపాటు కొందరు ఏబీవీపీ నాయకుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు జరుగుతున్నాయని, వీటిని తట్టుకోలేకే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది. అందరూ చెబుతున్నట్లుగా రోహిత్ వేముల ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని క్లోజర్ రిపోర్టులో తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. ‘‘దళిత హక్కుల కోసం పోరాడే అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో తన కార్యకలాపాలు, నిరసనల వల్ల రోహిత్ సరిగ్గా చదువుపై శ్రద్ధ పెట్టేవాడు కాదు. దీంతో ఆయనపై మానసికంగా చాలా ఒత్తిడి ఉండేది’’ అని రిపోర్టులో ఆరోపించారు.

‘‘మరోవైపు రోహిత్ కోసం ఆయన తల్లి ఒక ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ సృష్టించారు. ఈ విషయం ఎప్పుడు బయటపడుతుందోనని కూడా రోహిత్ ఆందోళన పడేవాడు. ఒకవేళ తన కులం సంగతి బయటపడితే, యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తారేమోనని భయపడేవాడు’’ అని రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తానికి రోహిత్ ఆత్మహత్యకు వేరొకరు కారణమని ఎలాంటి సాక్ష్యాలూ లభించలేదని, ఈ కేసును మూసివేసేందుకు అనుమతించాలని కోర్టు ఎదుట పోలీసులు కోరారు.

క్లోజర్ రిపోర్టులో అసలు తన కుమారుడు దళితుడే కాదని పోలీసులు పేర్కొనడం పచ్చి అబద్ధమని రోహిత్ తల్లి రాధిక వేముల వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. తన కుమారుడికి న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని ఆమె అన్నారు.

‘‘సరిగ్గా చదువుకోలేక పోవడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడంలో నిజంలేదు. చదువులో తను ముందంజలో ఉండేవాడు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లోనూ తను పాస్ అయ్యాడు’’ అని రాధిక అన్నారు. అసలు తన కొడుకు దళితుడు కాదని పోలీసులు ఎలా చెబుతున్నారో సాక్ష్యాధారాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.


అసలు ఆత్మహత్యకు కారణాలేమిటో దర్యాప్తు చేయమంటే, దాన్ని వదిలేసి రోహిత్ కులమే తప్పనే చెబుతూ అంశాన్ని పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని రోహిత్ సోదరుడు రాజా వేముల ఇండియా టుడే వార్తా సంస్థతో అన్నారు. రోహిత్ తల్లి, సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కేసును మళ్లీ పునర్విచారణ చేపట్టాలని వీరు కోరారు.

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

కాంగ్రెస్ అధికారంలోనున్న తెలంగాణలో రాష్ట్ర పోలీసులు క్లోజర్ రిపోర్టు ఫైల్ చేయడంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్ వేదికగా స్పందించారు.

‘‘రోహిత్ వేముల ఆత్మహత్యపై పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ చెత్త రాజకీయాలు చేశారు. ఇప్పుడేమో వారు అధికారంలోన్న రాష్ట్రంలోనే అసలు రోహిత్ దళితుడేకాదని పోలీసులు క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై దళితులందరికీ రాహుల్ క్షమాపణలు చెబుతారా?’’ అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు బీజేపీ నాయకులపై ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటోందని గతంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావ్ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ కూడా ఈ కేసును రీ-ఓపెన్ చేయడానికే మద్దతు పలుకుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జీ నిరంజన్ అన్నారు.‘‘రోహిత్ వేముల కేసు క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేసు పునర్విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని మేం కోరాం’’ అని ఆయన చెప్పారు.

డీజీపీ ఏం చెప్పారు?


క్లోజర్ రిపోర్టుపై నిరసనలు, వివాదాల నడుమ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. కేసును రీఓపెన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘ఈ కేసులో దర్యాప్తుపై రోహిత్ తల్లితోపాటు మరి కొంతమంది సందేహాలు లేవనెత్తారు. దీంతో దర్యాప్తును మళ్లీ కొనసాగించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేస్తాం’’ అని ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.

డీజీపీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల నడుమ ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలు శాంతించాయి. అయితే, ‘‘క్లోజర్ రిపోర్టు ద్వారా చనిపోయిన వ్యక్తిని అవమానించారు. ప్రభుత్వం మళ్లీ విచారణ చేయిస్తామంటోంది కాబట్టి వారేం చేస్తారో చూస్తాం, లేదంటే మేము కూడా చట్ట ప్రకారం ముందుకు వెళతాం’’ అని విద్యార్థి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories