మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

Road Accident On Keesara ORR Of Medchal
x

మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

Highlights

* ఇద్దరు మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు

Medchal: మేడ్చల్‌ జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఓఆర్‌ఆర్‌ సర్కిల్‌ సమీపంలో ఘట్‌కేసర్‌ నుంచి వస్తున్న ఏపీ 09 బీయూ 0990 బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా మీర్‌పేట్‌ నుంచి వస్తున్న టీఎస్‌ 05 యూసీ 4666 అనే నెంబర్‌ గల టాటా విస్టా ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories