Shamshabad: బస్సు కోసం వెయిట్ చేస్తున్న దంపతులను ఢీకొట్టిన లారీ.. లారీ చక్రాల కింద పడి భర్త మృతి

Road Accident In Shamshabad
x

Shamshabad: బస్సు కోసం వెయిట్ చేస్తున్న దంపతులను ఢీకొట్టిన లారీ.. లారీ చక్రాల కింద పడి భర్త మృతి

Highlights

Shamshabad: లారీ కింద నుంచి భార్యను లాగేసిన స్థానికులు

Shamshabad: శంషాబాద్ రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్‌గూడ చౌరస్తా వద్ద పాదచారులపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మృతిచెందాడు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న భార్యభర్తలను లారీ ఢీకొట్టడంతో వారిద్దరు లారీ టైర్ల కిందకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వెంటనే మహిళను లారీ కింద నుంచి బయటకు లాగేశారు. అయితే ఆమె భర్త లారీ కిందే నలిగిపోయి అక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సును లారీ ఓవర్ టేక్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు రత్తయ్య, మంజులుగా గుర్తించారు. పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్‌లో పనికోసం వచ్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories