Top
logo

BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం

BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం
X
Highlights

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాకలగూడెం ఓ ప్రెమేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైయ్యాయి.

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాకలగూడెం ఓ ప్రెమేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైయ్యాయి. హైదరాబాద్‌ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ సమీపంలోని ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను బస్సునుంచి బయటకు తీసి సేవలందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Next Story