Narayanpet: రోడ్డు ప్రమాదం.. వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Narayanpet: మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తింపు

Jyothi
Published on: 20 Oct 2023 11:28 AM IST
Road Accident In Narayanpet
X

Narayanpet: రోడ్డు ప్రమాదం.. వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Narayanpet: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ముందు వెళుతున్న వాహనాన్ని డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story