మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Road Accident in Mahabubabad Disterict
x

Representational Image

Highlights

* గూడూరు మండలం మర్రిమిట్ట దగ్గర ఆటో- లారీ ఢీ * ఆరుగురు మృతి, మృతుల్లో ముగ్గురు మహిళలు * మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గూడూరు మండలం మర్రిమిట్ట దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.

కొత్తగూడ మండలం గుంజేడు జాతరకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాదానికి లారీ డ్రైవర్‌ తప్పిదమే కారణమని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

మర్రిమిట్ట రోడ్డుప్రమాదం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories