Mohan Babu: టాలీవుడ్ కు రేవంత్ సూచన..స్పందించిన మోహన్ బాబు ఏమన్నారంటే?

Mohan Babu: టాలీవుడ్ కు రేవంత్ సూచన..స్పందించిన మోహన్ బాబు ఏమన్నారంటే?
x

Mohan Babu: టాలీవుడ్ కు రేవంత్ సూచన..స్పందించిన మోహన్ బాబు ఏమన్నారంటే?

Highlights

Mohan Babu: టాలీవుడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన కీలక సూచనపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ఆయన ఏమన్నారంటే

Mohan Babu: సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీఇండస్ట్రీకి అవగాహన కల్పించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచలపై నటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడారు. సినిమా నటీనటులును 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి ప్రభుత్వానికి పంపించమన్నారు. ఇంతకుముందే ఇలాంటి వీడియోలు కొన్ని చేశాను. అయినా సీఎం ఆదేశం మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలను రూపొందించి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నా అంటూ పేర్కొన్నారు. తన పోస్టుకు రేవంత్ రెడ్డి, సీఎంఓ ఖాతాలను ట్యాగ్ చేశారు.

అటు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోలో సెంటర్ లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెహికల్స్ ను ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమస్యలైన, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో సినిమా పరిశ్రమ తన వంతు బాధ్యత వహించడం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు నటుడు చిరంజీవి ముందుకు వచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories