Arvind Dharmapuri: రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ మంత్రి కాలేరు

Revanth Reddy Will Never Become A Minister Says Arvind Dharmapuri
x

Arvind Dharmapuri: రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ మంత్రి కాలేరు

Highlights

Arvind Dharmapuri: రేవంత్‌ను కొడంగల్‌లో తరిమితే, వచ్చి మల్కాజిగిరిలో పడ్డారు

Arvind Dharmapuri: పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో తమకు తెలుసునని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ అర్వింద్‌ అన్నారు. పసుపు బోర్డు నిర్వహించే కార్యకలాపాలపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్ రెడ్డికి లేదని.. ఇకపై జీవితంలో ఎప్పుడూ మంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. పసుపు పంటను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, చెరుకు ఫ్యాక్టరీలను కనుమరుగయ్యేలా చేసింది టీడీపని అర్వింద్ ఆరోపించారు. రేవంత్‌ను కొడంగల్‌లో తరిమితే వచ్చి మల్కాజిగిరిలో పడ్డారని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఎంపీ అర్వింద్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories