Revanth Reddy: కొడంగల్‌ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

Revanth Reddy Tweet On X To Express Of Winning Election
x

Revanth Reddy: కొడంగల్‌ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

Highlights

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి బరిలో దిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. తన గెలుపు పట్ల హర్షం ప్రకటిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. "ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా. అని రేవంత్ రెడ్డి ట్వీట్ లో వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories