Revanth Reddy: ఫిబ్రవరి 6 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

Revanth Reddy Padayatra from February 6
x

Revanth Reddy: ఫిబ్రవరి 6 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

Highlights

Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు కలిసి నడవనున్న సీనియర్ నాయకులు

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో ప్రజలతో మమేకం కాబోతున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రేవంత్ రెడ్డి ఒక్కరే గాకుండా... సీనియర్ నాయకులు కలిసి అడుగులు వేయనున్నారు. పార్టీ నాయకులు బేదాభిప్రాయాలున్నప్పటికీ సర్థుకు పోయే ధోరణితో పనిచేయాలని నిర్ణయించారు. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెంపొందించే విధంగా వ్యవహరిస్తే ఏ సమయంలోనైనా ప్రజలు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారనే విషయాన్ని నాయకులు గుర్తించారు.

రాహుల్ గాంధీ తరహాలోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో జోడో యాత్ర కు మద్దతు గా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేసేలా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు తీర్మానించారు. పార్టీ కొత్త ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే ఆధ్వర్యంలో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు నెలలపాటు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఇన్ని రోజులు రేవంత్‌ ఒక్కరే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్లు సైతం యాత్రలో పాల్గొనేలా నిర్ణయం జరిగింది. ప్రాంతాల వారీగా సీనియర్‌ నేతలు యాత్రలు చేయాలని తీర్మానించారు. ప్రారంభ కార్యక్రమానికి సోనియా లేదంటే ప్రియాంక రావాలని ఆహ్వానిస్తూ టీ పీసీసీ. విస్తృత స్థాయి సమావేశం లో తీర్మానం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కొత్త పంధాను అనుసరించబోతోంది. పార్టీ అంటే ఒక్కరే బాధ్యత తీసుకోవడం కాదు.. కలిసికట్టుగా తీసుకోవాలనే విధానాన్ని అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది. నాయకులు భిన్నాభిప్రాయాలతో ఉంటారు. నాయకులు పార్టీ పరువు కాపాడుతూ ప్రజాహితాన్ని దృష్టిలోపెట్టుకుని మాట్లాడాలని నిర్ణయించారు. ఈ ప్రకారమే నాయకులు భవిష్యత్తులో వ్యవహరించాలని నిర్ణయించారు. నాయకుల వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులొస్తాయని కాంగ్రెస్ వ్యవహారల కొత్త ఇన్ ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ప్రత్యేకంగా ప్రస్తావనకు తెచ్చారు.

ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ఇకనుంచి ఏది చేసినా నాయకులంతా కలిసి కట్టుగా చేసినట్లు ప్రజలకు తెలిసేటట్లు చేయనున్నారు. సీనియారిటీ, అనుభవం, ప్రజాకర్షణ మేళవింపుతో జనంతో మమేకమయ్యేందుకు పార్టీ నాయకులు దృష్టిపెట్టాలన్నది ప్రధాన ఉద్ధేశంగా కన్పిస్తోంది. సీనియర నాయకులు భేషిజాలకులకు పోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ వ్యవహారాల కొత్త ఇన్ ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే సూచనలు నాయకులకు బోధపడినట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకులు ఎవరు చిన్నబుచ్చుకున్నా... ఎఫెక్టయ్యేది పార్టీకేనని నాయకులు గుర్తించారు. కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories