Revanth Reddy: ఇవాళ కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి నామినేషన్

Revanth Reddy Nomination in Kodangal Today
x

Revanth Reddy: ఇవాళ కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి నామినేషన్

Highlights

Revanth Reddy: ఉ.11 గంటలకు నామినేషన్‌ వేయనున్న రేవంత్‌

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ముఖ్య నాయకులంతా నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. కోడంగల్‌లోని ఆయన నివాసం నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి...ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో కూడా రేవంత్ పోటీ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈనెల 8న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రభుత్వ డైట్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో టీడీపీ తరఫున కొడంగల్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి 5వేల 976 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వరుసగా రెండోసారి టీడీపీ నుంచి బరిలో నిలిచి 14వేల614 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజగిరి నియోజకవర్గం తరపున గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories