KTR On Runamafi: రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy is cheating in the name of loan waiver KTRs sensational comments
x

KTR On Runamafi: రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Highlights

KTR On Runamafi: రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. 40లక్షలకు పైగా రైతులు లక్షరూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా సెలక్ట్ చేస్తారంటూ నిలదీశారు.

KTR On Runamafi:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. తొలివిడతగా రూ.లక్ష మేర రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఆగస్టు 15వ తేదీ లోపు 2లక్షల రూపాయల మేర ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రేవంత్ అమలు చేస్తున్న రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

తెలంగాణలో రైతులకు పంట రుణాల మాఫీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. మూడు దఫాలుగా ఈ రుణాలను మాఫీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆగస్టు 15వ తేదీ లోపు ప్రభుత్వం పూర్తి చేయలన్న ప్రణాళికను పెట్టుకుంది. దీనిలో భాగంగానే గురువారం లక్ష రూపాయల మేర ఉన్న రుణాలను రైతుల అకౌంట్లో జమ చేసింది. ఈ క్రమంలో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం రుణమాఫీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టును కూడా షేర్ చేశారు.

రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతు బంధు కింద జూన్ లో ఇవ్వాల్సిన నిధుల్లో నుంచే 7వేల కోట్లను రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచికొంత మొత్తం విదిల్చి..రుణమాఫీ చేస్తున్నామంటూ పోజులు కొడుతున్నారంటూ కేటీఆర్ అన్నారు. 40లక్షలకు పైగా రైతులు లక్షరూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా సెలక్ట్ చేస్తారంటూ నిలదీశారు.

2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో పోలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం పావు వంతు రైతులకే అర్హతనా అంటూ ప్రశ్నించారు. 2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి 16 వేల 144 కోట్లు వెచ్చించారన్నారు. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని కేటీఆర్ తెలిపారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి 19 వేల198 కోట్లు అంచనా వేసింది. మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు.. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలన్ని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు రిలీజ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories