Cash for Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట

Cash for Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట
x

Cash for Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట

Highlights

Cash for Vote Case: ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Cash for Vote Case: ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సీఎం, హోంమంత్రికి రిపోర్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఏసీబీని ఆదేశించింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేయాలని సూచించింది. విచారణ జరుగుతున్న దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని కోర్టు అభిప్రాయపడింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని సుప్రీం తెలిపింది.

ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు బదిలీ చేయాలని మాజీ మంత్రి జి. జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాన్ని పిటిషనర్ వ్యక్తం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ముగించింది. 2015లో రేవంత్ రెడ్డి టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసు నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories