Revanth Reddy: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు రిప్లయ్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy Gave a Reply to Minister KTR Legal Notices
x

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు రిప్లయ్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: లీగల్‌ నోటీసులో పలు అంశాలతో కౌంటర్‌ ఇచ్చిన రేవంత్‌

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రిప్లయ్‌ ఇచ్చారు. లీగల్‌ నోటీసులో పలు అంశాలతో కౌంటర్‌ ఇచ్చారు రేవంత్‌. లీగల్‌ నోటీస్‌ వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని, తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదన్నారు. ఉద్యమం సమయంలో కేటీఆర్‌ ఈ దేశంలో లేనందున ఆయనకు ఆ బాధ తెలియదన్నారు. TSPSC ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరఫున మాట్లాడతానన్న రేవంత్‌..TSPSC సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందని, అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌ నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని రేవంత్‌ ఆరోపించారు. TSPSC పేపర్ లీకేజీపై హైకోర్టులో పిటిషన్ వేశామని, అలాగే.. ఈడీ, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories