Revanth Reddy: ప్రగతిభవన్, సచివాలయం కట్టిన కేసీఆర్‌ అమరుల స్థూపం కట్టలేకపోయారు

Revanth Reddy Comments On CM KCR
x

Revanth Reddy: ప్రగతిభవన్, సచివాలయం కట్టిన కేసీఆర్‌ అమరుల స్థూపం కట్టలేకపోయారు

Highlights

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టాలి

Revanth Reddy: నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం చేసే తుది దశ ఉద్యమమే జోడో యాత్ర అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తామంతా గాంధీ వారసులమని హింసకు వ్యతిరేకంగా శాంతి కోసమే ఉద్యమం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఎన్‌కౌంటర్లు ఉండవన్న కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్‌కౌంటర్లకు ఏం సమాధానం చెబుతారని రేవంత్ ప్రశ్నించారు. 9నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టిన బీఆర్‌ఎస్ 9 ఏళ్లు గడిచినా అమరవీరుల స్థూపం కట్టలేకపోయిందని వాపోయారు. తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిచ్చినట్లు రేవంత్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories