Revanth Reddy: బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్ అని మరోసారి నిరూపితమైంది

Revanth Reddy Comments On BRS
x

Revanth Reddy: బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్ అని మరోసారి నిరూపితమైంది

Highlights

Revanth Reddy: రేపటి కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష నుంచి దృష్టి మరల్చేందుకే.. బీఆర్ఎస్ ఉచిత విద్యుత్‌ గురించి రాద్ధాంతం చేస్తోంది

Revanth Reddy: బీఆర్ఎస్ బీజేపీకి B టీమ్ అని మరోసారి నిరూపితమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పిలుపునివ్వడంతో.. తమ నిరసనలను నీరు గార్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. అందుకే ఉచిత విద్యుత్‌ వైపు దృష్టి మరల్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.

తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories