జన్వాడలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్టు

జన్వాడలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్టు
x
Revanth Reddy File Photo
Highlights

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి జన్వాడ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్వాడలోని మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌ దగ్గర ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి జన్వాడ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్వాడలోని మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌ దగ్గర ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే111 జీవోను తుంగలో తొక్కి.. అక్రమంగా కేటీఆర్ ఫామ్‌హౌజ్‌ను నిర్మించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కేటీఆర్‌ ఫామ్‌హౌజ్‌ నిర్మాణం చేపట్టారని విమర్శించారు.

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫామ్‌ హౌస్‌ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఫామ్ హౌజ్ ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యలో నేతలను అరెస్ట్‌ చేశారు. రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు వారి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories