MP Asaduddin Owaisi: SETWIN షిఫ్ట్ అయితే ఊరుకునేది లేదు... సీఎం రేవంత్ రెడ్డికి ఓవైసీ అల్టిమేటం..!!

MP Asaduddin Owaisi: SETWIN షిఫ్ట్ అయితే ఊరుకునేది లేదు... సీఎం రేవంత్ రెడ్డికి ఓవైసీ అల్టిమేటం..!!
x
Highlights

MP Asaduddin Owaisi: SETWIN షిఫ్ట్ అయితే ఊరుకునేది లేదు... సీఎం రేవంత్ రెడ్డికి ఓవైసీ అల్టిమేటం..!!

MP Asaduddin Owaisi: పురానీహవేలీ నుంచి SETWIN కార్యాలయాన్ని తరలించాలన్న ప్రతిపాదనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రేవంత్ రెడ్డి సర్కార్‌ పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ లకు ఓవైసీ ఘాటుగా లేఖ రాశారు. SETWINను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని.. యథాతథంగా కొనసాగించాల్సిందేనని ఒవైసీ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఘాటైన లేఖ రాసి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పురానీహవేలీ ప్రాంతంతో SETWINకు విడదీయరాని అనుబంధం ఉందని, ఈ కార్యాలయం వేలాది మంది పేద, మధ్యతరగతి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని ఒవైసీ గుర్తు చేశారు. కార్యాలయం మారితే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఇది కేవలం భవనం మార్పు అంశం కాదని, ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఒవైసీ, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని కూడా రంగంలోకి దించారు. స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే రాజకీయంగా, ప్రజాస్థాయిలో పోరాటం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. SETWIN షిఫ్ట్ అంశం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్‌కు కీలక పరీక్షగా మారింది. మరి ఈ అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories