Corona Effect: తెలంగాణలో మళ్లీ ఆంక్షలు?

Rectrictions in Telangana Again Due to Covid-19
x

కరోనా సెకండ వేవ్ ఎఫెక్ట్: తెలంగాణలో మళ్లీ ఆంక్షలు

Highlights

Corona Effect: కరోనా వ్యాప్తి కట్టడి కోసం తెలంగాణలో మళ్లీ ఆంక్షలు విధించే పరిస్థితి నెలకొన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతోంది.

Corona Effect: కరోనా వ్యాప్తి కట్టడి కోసం తెలంగాణలో మళ్లీ ఆంక్షలు విధించే పరిస్థితి నెలకొన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతోంది. ఈమేరకు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను అందించింది. కరోనా పరిస్థితిపై బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లలో సీటింగ్‌ కెపాసిటిని తగ్గించటం, బార్లను మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం.

రాత్రి సమయాల్లో జనసంచారంపైనా నియంత్రణ అవసరమని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 పేషెంట్ల కోసం పడకలను పెంచాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కేసులు పెరిగితే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సమీక్ష సందర్భంగా సూచించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆక్సిజన్‌ వృథాను అరికట్టాలని సూచించారు. కాగా కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రులకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు మరో 1250 బెడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ ఎంజీఎంలో 150, నిజామాబాద్‌ జీజీహెచ్‌లో 250, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌లో 150, నల్లగొండ జీజీహెచ్‌లో 150, సూర్యాపేట జీజీహెచ్‌లో 200, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 200, సూర్యాపేట జీజీహెచ్‌లో 200 అదనపు బెడ్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో 9,281 కరోనా బెడ్లు ఉండగా, పెంపుతో ఆ సంఖ్య 10,531కి చేరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories