Renu Desai: రేణు దేశాయ్ విమర్శలకు మద్దతుగా నిలిచిన యూట్యూబర్ అన్వేష్

Renu Desai: రేణు దేశాయ్ విమర్శలకు మద్దతుగా నిలిచిన యూట్యూబర్ అన్వేష్
x

Renu Desai: రేణు దేశాయ్ విమర్శలకు మద్దతుగా నిలిచిన యూట్యూబర్ అన్వేష్

Highlights

Renu Desai: రేణు దేశాయ్ వీధి కుక్కల చంపడంపై తీవ్రంగా స్పందించారు. అవినీతి, న్యాయ వ్యవస్థపై ఆమె వ్యాఖ్యలకు యూట్యూబర్ అన్వేష్ మద్దతు తెలిపారు.

Renu Desai: సినీ నటి రేణు దేశాయ్ వీధి కుక్కలను చంపుతున్న ఘటనలపై తన కవిత్వంతో సీరియస్‌గా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర, స్థానిక అధికారులపై ఘాటుగా విమర్శలు చెబుతూ, జీహెచ్‌ఎంసీ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ మొత్తం అవినీతితో నిండిపోయిందని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు దారి తీసగా, అనేక వర్గాల నుంచి స్పందనలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ రేణు దేశాయ్‌కి మద్దతుగా నిలిచారు. 2026కి ఇది బెస్ట్ స్పీచ్ అని, దేశంలో అవినీతి గురించి భయపడకుండా ఆమె మాట్లాడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రేణుపై శివాజీ మహారాజ్ ఆత్మ పూనినట్టే ధైర్యంగా వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.

అన్వేష్ భారత రాజకీయ వ్యవస్థపై కూడా అభిప్రాయం తెలిపారు. “ప్రపంచంలో ఎక్కువగా రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి, కానీ భారత్‌లో 4,500కు పైగా పార్టీలు ఉండటం వల్లే అవినీతి పెరుగుతోంది. పార్టీల సంఖ్య తగ్గితేనే వ్యవస్థలో మార్పు సాధ్యమని” అన్నారు.

రేణు దేశాయ్ స్పందన, అన్వేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చార్హంగా మారాయి. న్యాయ, రాజకీయ వ్యవస్థలో లోపాలను ఉద్దేశపూర్వకంగా టచ్ చేసినందుకు ఆమె అభిమానులు, విమర్శకులు రెండూ ప్రస్తావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories