Telangana: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట

Relief to Government in Telangana High Court
x

Telangana: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట

Highlights

Telangana: డిస్కమ్‌లు కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్న నేషనల్ డిస్పాచ్ సెంటర్

Telangana: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 261 కోట్లు చెల్లించాలని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కమ్‌లు విద్యుత్‌ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా నేషనల్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అడ్డుకుంది. ఉదయం నుంచి విద్యుత్‌ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్‌ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్‌ బిడ్డింగ్‌కు అనుమతించాలని NLDCని ఆదేశించింది. దీంతో విద్యుత్‌ కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories