హైకోర్టులో ప్రభాస్‌కు ఊరట

హైకోర్టులో ప్రభాస్‌కు ఊరట
x
Highlights

సినీనటుడు ప్రభాస్ కు హైకోర్టులో ప్రభాస్‌కు ఊరట లభించింది. పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రంగారెడ్డి...

సినీనటుడు ప్రభాస్ కు హైకోర్టులో ప్రభాస్‌కు ఊరట లభించింది. పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో ఆరు దశాబ్దాలుగా సాగుతున్న వందల ఎకరాల్లో ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం విధి విధానాలను అనుసరించలేదని పేర్కొంది. భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్‌ సేల్‌ డీడ్ల ద్వారా క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే వారి స్వాధీనం అవుతుందని వెల్లడించింది. ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories