TSRTC: ఆర్టీసి ఆదాయంలో రికార్డు.. 24 గంటల వ్యవధిలో 54లక్షల మందిని గమస్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ

Record in TSRTC Revenue
x

TSRTC: ఆర్టీసి ఆదాయంలో రికార్డు.. 24 గంటల వ్యవధిలో 54లక్షల మందిని గమస్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ

Highlights

TSRTC: 35 లక్షల 32 వేల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులు

TSRTC: తెలంగాణ ఆర్టీసీ 24 గంటల వ్యవధిలో 54లక్షల మంది ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించింది. 24 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయం పొంది రికార్డు సృష్టించింది. ఈనెల 13న ఓటేసేందుకు జనం పోటెత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉండి, హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు సొంతూళ్లకు క్యూకట్టారు

రెండో శనివారం, ఆదివారం తో కలిసి రావడంతో చాలా మంది పోలింగ్ కు రెండు రోజుల ముందే వెళ్లారు మిగతావారు వీలును బట్టి పోలింగ్ రోజు వరకూ వెళ్లారు...కానీ చాలా 14వ తేదీ తిరిగిద హైదరాబాద్ తోపాటు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. బుధవారం తెలంగాణ ఆర్టీసీ బస్సులు కిక్కిరిశాయి. ఆరోజు ఏకంగా 54 లక్షల మంది తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారు. ఆరోజు తెలంగాణ ఆర్టీసీ బస్సలు 35 లక్షల 32 వేల కిలోమీటర్లు ప్రయాణించాయి.ఆక్యుపెన్సీ రేషియో 106శాతంగా నమోదైంది. కిలోమీటర్ కు 69 రూపాయల చొప్పున ఆదాయం సమకూరింది, మొత్తం24 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయం పొంది రికార్డు సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories