ఖమ్మం జిల్లాలో కనిపించిన అరుదైన జంతువు

ఖమ్మం జిల్లాలో కనిపించిన అరుదైన జంతువు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో ఎన్నో అరుదైన జంతు జాతులు ఉన్నాయి. ఈ అరుదైన జంతువులు ఎక్కువగా అడవుల్లోనే జీవనం సాగిస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు...

తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో ఎన్నో అరుదైన జంతు జాతులు ఉన్నాయి. ఈ అరుదైన జంతువులు ఎక్కువగా అడవుల్లోనే జీవనం సాగిస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని జంతువులు అలా మనుషులకు తారసపడుతుంటాయి. అదే క్రమంలో ఓ జంతువు టిప్పర్ డ్రైవర్లకు కనిపించింది. అసలు ఆ జంతువు ఏ జాతికి చెందింది, ఎక్కడ కనిపించింది ఇప్పుడు తెలుసుకుందాం.

ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఓ అరుదైన జంతువు అక్కడ పనిచేసే కొంత మంది టిప్పర్ డ్రైవర్లకు కనిపించింది. అయితే ఆ జంతువు కాస్త వింతగా కనిపించడంతో స్థానికులు, డ్రైవర్ లు దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆ తరువాత ఆ జంతువు గురించి అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ జంతువును అరుదైన మూషిక జింక గా గుర్తించారు.

అనంతరం అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ ఆ జంతువును మూషిక జింకగా నిర్ధారించామని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జంతువు సంచరిస్తుందని వివరించారు. ఈ జంతువు అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో ఒకటని వారు తెలిపారు. ప్రస్తుతం లభ్యమైన మూషిక జింక వయస్సు ముడు నెలలు ఉంటుందన్నారు. జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలోని కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో ఈ మూషిక జింక లభ్యం కావడం విశేషమన్నారు. అనంతరం రేంజర్ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఆ మూషిక జింక పిల్లను అటవీ సిబ్బంది కిన్నెరసాని వణ్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. ఏదైనా జంతులువులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

అయితే గతంలోకూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా అనేక జంతువులు అడవుల నుండి జనావాసాల్లోకి వచ్చాయి. అప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు ఆయా జంతువులను పట్టుకుని జూ పార్కుకు, అడవులకు తరలించిన ఘటనలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories