Top
logo

నాలుగేళ్ల బాలికపై అత్యాచార యత్నం

నాలుగేళ్ల బాలికపై అత్యాచార యత్నం
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అభం శుభం ఎరుగని పసి పిల్లల విషయంలో కూడా రోజుకో దారుణం...

తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అభం శుభం ఎరుగని పసి పిల్లల విషయంలో కూడా రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. సంగారెడ్డి జిల్లా కొత్వాన్‌పల్లిలో నాలుగేళ్ల చిన్నారిపై జైపాల్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్వాన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో క్లస్టర్‌గా పనిచేస్తున్న జైపాల్ స్కూల్ పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఒంటిరిగా ఉన్న చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు జైపాల్‌‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.


లైవ్ టీవి


Share it
Top