ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాణి రుద్రమదేవి

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాణి రుద్రమదేవి
x
Highlights

యువతెలంగాణ పార్టీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమదేవి ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్,...

యువతెలంగాణ పార్టీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమదేవి ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా యువతెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన ఆమె.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం రాణి రుద్రమదేవి మాట్లాడుతూ.. తెలంగాణ అక్క చెల్లెల్లకు,అన్నదమ్ములకు నా నమస్కారం,

కరీంనగర్,మెదక్,ఆదిలాబాద్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులకు విన్నపం...తెలంగాణ రాష్ట్రా సాధనలో ఉద్యమకారినిగా,ఒక జర్నలిస్ట్ గా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేను, ఒక ప్రజాప్రతినిధి గా చట్టసభల్లోకి వెళ్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషిచేస్తాను.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పట్టభద్రులు,ఉద్యోగస్తులు,మహిళల సమస్యల పరిష్కారానికి మరింత బాధ్యతగా పోరాడగలననే నమ్మకంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.. నన్ను ఆశీర్వదించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి మీ ప్రతినిధిగా శాసనమండలికి పంపిస్తారని మీ ఆడబిడ్డగా కోరుతున్నాను అని కోరారు.














Show Full Article
Print Article
Next Story
More Stories