Ramadan 2026 : రంజాన్ వేళ భాగ్యనగరంలో నైట్ షాపింగ్.. 24 గంటలు దుకాణాలు తెరిచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Ramadan 2026 : రంజాన్ వేళ భాగ్యనగరంలో నైట్ షాపింగ్.. 24 గంటలు దుకాణాలు తెరిచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
x
Highlights

రంజాన్ వేళ భాగ్యనగరంలో నైట్ షాపింగ్.. 24 గంటలు దుకాణాలు తెరిచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Ramadan 2026 : తెలంగాణలో పవిత్ర రంజాన్ మాసం సందడి మొదలైంది. ఆధ్యాత్మిక చింతన, కఠిన ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనల నడుమ ముస్లిం సోదరులు ఈ నెలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ రంజాన్ కళతో వెలిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లింలకు, వ్యాపారస్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ సీజన్‌లో వ్యాపార లావాదేవీలు ఎక్కువగా రాత్రి వేళల్లోనే జరుగుతుంటాయి కాబట్టి దుకాణదారులు తమ వ్యాపారాలను 24 గంటల పాటు కొనసాగించుకోవచ్చని సర్కార్ వెల్లడించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వ్యాపార వర్గాల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. ఈ వెసులుబాటు వల్ల ఆర్థికంగా తాము నిలదొక్కుకుంటామని, పండుగ సీజన్‌లో మంచి లాభాలు వస్తాయని వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హలీం సెంటర్లకు పోలీసుల కఠిన నిబంధనలు

రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఘుమఘుమలాడే హలీమ్. అయితే హలీమ్ విక్రయశాలల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హలీమ్ హోటళ్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా నిర్వాహకులే వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, రోడ్లపై వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండకుండా చూడాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎన్నికల వేళ ఇఫ్తార్ రాజకీయం

2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది రంజాన్ మాసం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులకు ప్లాన్ చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయేలా వేడుకలు నిర్వహించాలని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు శాంతిభద్రతల దృష్ట్యా పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని పోలీస్ శాఖ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories