Ram Gopal Varma: రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ కేసీఆర్

Ram Gopal Varma: బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్ వెళుతుంద‌న్న వ‌ర్మ

Rama Rao
Updated on: 27 Sept 2022 4:30 PM IST
Ram Gopal Varma Tweet on KCR National Politics | Telugu News
X

Ram Gopal Varma: రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ కేసీఆర్

Ram Gopal Varma: టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌శంసిస్తూ సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను పెట్టారు. అందులో కేసీఆర్‌ను రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ అంటూ ఆయ‌న కితాబునిచ్చారు. తెలుగులో పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు సాధించిన సినిమాల‌తో పాటు అందులో లీడ్ రోల్‌లో క‌నిపించిన టాలీవుడ్ హీరోల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ వ‌ర్మ ట్వీట్ పోస్ట్ సాగ‌డం గ‌మ‌నార్హం.

బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, పుష్ప‌, కేజీఎఫ్ 2 అడుగు జాడ‌ల్లో ప‌య‌నిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి బీఆర్ఎస్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని వ‌ర్మ తెలిపారు. రీల్ ఫిల్మ్ స్టార్‌లు అయిన య‌శ్‌, ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్‌గా నిల‌వ‌నున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Rama Rao

Rama Rao

Next Story