ప్రైవేటు వ్యక్తికి రాజ్యసభ ఎంపీ భద్రత..జగన్‌ అల్లుడు అనే వ్యక్తికి గన్‌మెన్లతో సెక్యూరిటీ

ప్రైవేటు వ్యక్తికి రాజ్యసభ ఎంపీ భద్రత..జగన్‌ అల్లుడు అనే వ్యక్తికి గన్‌మెన్లతో సెక్యూరిటీ
x
Highlights

ఓ ఎంపీ అంగరక్షకులు అతడికి కాకుండా మరో వ్యక్తికి రక్షణగా నిలిచారు. అతడు ఎటువెళ్లినా అక్కడ అతడిని రక్షిస్తూ పహారా కాచారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ...

ఓ ఎంపీ అంగరక్షకులు అతడికి కాకుండా మరో వ్యక్తికి రక్షణగా నిలిచారు. అతడు ఎటువెళ్లినా అక్కడ అతడిని రక్షిస్తూ పహారా కాచారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్‌ గన్‌మెన్ల నిర్వాకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ అల్లుడు అనే వ్యక్తికి ఎంపీ బండ ప్రకాశ్‌ గన్‌మెన్లు సెక్యూరిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

జగన్‌ అల్లుడు పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌లో దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు పోస్ట్‌ అయ్యాయి. అంతేకాకుండా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి ఈ పోస్ట్‌ను ట్యాగ్‌ కూడా చేశారు. హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టును సందర్శించానంటూ తన పర్యటన తాలూకు వివరాలు వెల్లడిస్తున్న జగన్‌ అల్లుడు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఓ ప్రైవేటు వ్యక్తికి సెక్యూరిటీ ఇచ్చిన గన్‌మెన్లు మరి ఎంపీ భద్రతను గాలికొదిలేశారా..? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏదేమైనా అంగరక్షకుల వ్యవహారం చర్చకు దారి తీసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories