పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజనర్సింహ

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజనర్సింహ
x
Highlights

తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ఏ పార్టీలోకి...

తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ఏ పార్టీలోకి వెళ్లానని స్పష్టం చేశారు. పార్టీ మారడంకోసం తాను ఎవరినీ కలవడం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, దామోదర రాజనర్సింహ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలపై సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కాంగ్రెస్ సమావేశానికి సైతం దామోదర దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారని అందరూ భావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories