పాకిస్థాన్ వాళ్లకు ఇల్లు ఇస్తారా?.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

పాకిస్థాన్ వాళ్లకు ఇల్లు ఇస్తారా?.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
x
రాజాసింగ్ ఫైల్ ఫోటో
Highlights

పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు నగరంలో నివాసం కల్పిస్తారా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు నగరంలో నివాసం కల్పిస్తారా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు. సీఏఏపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు.. ఎంఐఎంను సంతోష పెట్టడానికి టీఆర్‌ఎస్ నేతలు ఇలా చేస్తారా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికపూడి మాట్లాడుతున్న ఓ వీడియో చూశాను. ముస్లింలు భయపడొద్దని, టీఆర్‌ఎస్ కాపాడుతుందని అంటున్నారు. అసెంబ్లీల తీర్మానం చేశాం ముస్లింలను పంపిస్తే మీ వెంట మేమేంటాం. అంటున్నారు. అసలు మీరు సీఏఏ గురించి తెలుసుకున్నారా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బంగ్లాదేశ్, పాక్ ముస్లింలకు సర్టిఫికెట్లు, ఇళ్లు ఇస్తారా అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రంగు బయటపడిందని అన్నారు. ముస్లింలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఇటీవలే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మైనార్టీలతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ నుంచి వచ్చినా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడం జరగదంటూ వ్యాఖ్యానించారు. మైనార్టీలను పంపించే పరిస్థితి వస్తే వారికి అండగా ఉంటామని, మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ నేతలు సీఏఏకు ఏజెంట్లుగా పని చేస్తున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories