Raja Singh: ఇవాళ మోడీ తెలంగాణకే వస్తున్నారు.. దమ్ముంటే సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ మోడీని కలవాలి

Raja Singh Comments On KCR And KTR
x

Raja Singh: ఇవాళ మోడీ తెలంగాణకే వస్తున్నారు.. దమ్ముంటే సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ మోడీని కలవాలి

Highlights

Raja Singh: రాష్ట్రానికి ఏం నిధులు కావాలో అడగాలి

Raja Singh: తెలంగాణలో మోడీ పర్యటనతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మోడీ టూర్‌పై బీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు మోడీ తెలంగాణకే వస్తున్నారు కదా.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే ప్రధాని మోడీని కలవాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో మోడీని అడగాలని, అంతేకానీ అనవసర విమర్శలు చేయొద్దని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories