ఇవాళ నామినేషన్ వేయనున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

Raj Gopal Reddy: టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన రాజగోపాల్ రెడ్డి

Jyothi
Updated on: 10 Oct 2022 7:26 AM IST
Raj Gopal Reddy is the BJP Candidate will be Nomination Today
X

ఇవాళ నామినేషన్ వేయనున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

Raj Gopal Reddy: మునుగోడులో ఎన్నికల కోలాహలం నెలకొంది. బరిలో దిగే ప్రధాన రాజకీయ పార్టీలను అభ్యర్థులు ఎవరనే అంశంపై క్లారిటీ వచ్చేసింది. ఆయా పార్టీలనుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, వివేక్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బూపేందర్ యాదవ్ హాజరుకానున్నారు. మునుగోడు సీటు బీజేపీకే దక్కాలన్న లక్ష్యంతో బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న రాజగోపాల్‌రెడ్డి..కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాను 20వేల కాంట్రాక్టులకు లొంగిపోయానన్న మాట్లల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story