ఎన్నికల ప్రచారానికి పరేషాన్.. వర్ష ప్రభావంపై... అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన

Rain Effect To Election Campaign
x

ఎన్నికల ప్రచారానికి పరేషాన్.. వర్ష ప్రభావంపై... అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన  

Highlights

Telangana: ప్రచారాకు తీవ్ర ఆటంకంగా మారిన వర్షాలు

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారాలకు మరో నాలుగు రోజులే గడువు ఉంది. విమర్శలు ప్రతివిమ‌ర్శలు... వ్యూహాలు ప్రతి వ్యూహాలతో వేడిక్కిన రాష్ట్ర రాజకీయాలు ఒక్క వర్షంతో చల్లబడ్డాయి. మరో రెండు రోజులపాటు ఇదే వర్షాలు ఉండనున్నట్టు వాతావరణ శాఖ చెబుతుండటంతో.. అభ్యర్థలు ఆందోళనలో పడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. చివరి రోజుల్లో ఉధృత ప్రచారం నిర్వహించాల్సి ఉండగా.. అకాల వర్షం అభ్యర్థుల ప్రణాళికలను తలకిందులు చేసింది. ప్రచార షెడ్యూల్ అయోమయంలో పడింది. ఈ రెండు, మూడు రోజులు నగరంలో అగ్రనేతల ప్రచారానికి షెడ్యూల్ ఖరారు కాగా వాన కొనసాగుతుందా...? తగ్గు తుందా..? అన్న టెన్షన్లో ఉన్నారు. గురువారం నాటి వర్షం అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు చల్లటి వాతావరణంతో వణకాల్సి వచ్చింది. ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టిపడేయంతో ప్రచారంలో పదును తగ్గింది. నిన్నా, మొన్నటివరకు ఇంటింటికి తిరిగి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరిన కార్యకర్తలు మారిన వాతావర ణంతో గడప దాటడం లేదు.

దీంతో అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళ నాడు తీరప్రాంతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా గురు వారం తెల్లవారుజామునుంచే నగరంలో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న ఈదురుగాలులతోపాటు చినుకులు పడుతుండడంతో నగరంలో చల్ల దనం ఏర్పడింది. ఈ క్రమంలో తెల్లవారుజామున ప్రారంభ మైన జల్లులు రాత్రి వరకు కురిశాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురియడంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వర్షానికి తోడు చల్లని గాలులు వీస్తుండడంతో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడ్డారు. నగరంలో కేటీఆర్, రేవంత్రెడ్డి రోడ్ షోలు పలు ప్రాంతాల్లో జరిగాయి. భారీ వర్షంతో రోడ్ షోలకు వచ్చిన ప్రజలు అర్ధాంత రంగా వెళ్లిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏంటన్న ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

ప్రచారంపై ప్రభావం... గ్రేటర్లో గతానికి భిన్నంగా జరుగుతున్న ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు కృషి చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారానికి మరో నాలుగురోజుల సమయం మాత్రమే ఉండడంతో పార్టీలకు సంబంధించిన అగ్ర నేతలను నగరానికి రప్పించుకుని రోడ్లు, సభలు నిర్వహిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకుని పెద్ద మొత్తంలో ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్న నాలుగు రోజుల్లోనే వీలైనంత ఎక్కువగా ప్రజలను కలుసుకుని ప్రచారాన్ని ముగించాలని భావిస్తున్న తరుణంలో వరుణుడు ఒక్కసా రిగా రావడంతో అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇప్ప టికే ఏర్పాటు చేసిన రోడ్లు, సభలు ఎలా నిర్వహించాలో తెలియక సతమతమవుతున్నారు.

రేపటి వరకు రెయిన్ అలర్ట్..!

సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు నవంబర్ మొదటి వారంలో నగరానికి వస్తుంటాయి. అయితే ఈసారి మూడు వారాలపాటు ఆలస్యంగా రావడంతో ప్రచారానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో పార్టీల అగ్ర నేతలు నగరానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 27న ప్రధాని మోదీ సభ, 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ సభతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోడోల్లో పాల్గొననున్నారు.

అయితే నగరంలో కురుస్తున్న వర్షంతోపాటు చల్లని వాతావరణం ఏర్పడడంతో ఆయా పార్టీల కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కాగా, మొదటి, రెండో విడతలో టికెట్లు దక్కించుకున్న అభ్య ర్థులు తమ సెగ్మెంట్లలో ప్రచారాన్ని ముగించే దశలో ఉండగా.. చివరిలో టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. పోటీచేస్తున్న ప్రాంతంలో ఇప్పటివరకు 65 శాతం వరకు తిరగలేదని తెలుస్తోంది. ఓటర్లను ఒక్కసారిగా కూడా కలవకుంటే ఎలా ఉంటుందోనని హైరానా పడుతున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో చిరుజల్లులతోపాటు మోస్తరు వర్షం కురుస్తుం దని, శనివారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే వర్షం తగ్గుముఖం పట్టకుంటే ప్రచారం ఆగిపోతుందని అభ్యర్థులు భయపడుతున్నారు.. తడిసి ముద్దయిన నగరం(మొదటిపేజీ తరువాయి) అరగంట నుంచి గంటపాటు సరఫరాలో అంతరా యాలు తలెత్తాయి. దట్టమైన మబ్బులు కమ్మేయడంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా చీకటి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం గంటపాటు పలుప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా చార్మినార్ సర్దార్ మహల్లో 2.6 సెం.మీ., గౌలివాడ జుమరాత్ బజార్ 2.5, ఆస్మాన్గఢ్ 2.4, యాకుత్పరలో 2.2 సెం.మీ వర్షం కురిసింది. వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జల్లులతో చలిగాలుల తీవ్రత పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories