తెలంగాణలో ప్రియాంకాగాంధీ టూర్‌కు రెయిన్ ఎఫెక్ట్

Rain Effect for Priyanka Gandhi Tour in Telangana
x

తెలంగాణలో ప్రియాంకాగాంధీ టూర్‌కు రెయిన్ ఎఫెక్ట్

Highlights

Priyanka Gandhi: మరోసారి ప్రియాంకాగాంధీ బహిరంగ సభ వాయిదా

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన పాలమూరు ప్రజా గర్జన సభ మరో సారి వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఒకసారి కొల్లాపూర్ సభను ఆ పార్టీ నేతలు వాయిదా వేశారు. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరోసారి సభను వాయిదా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభకు జనసమీకరణ ఇబ్బందయ్యే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేస్తున్నట్టు హస్తం నేతలు స్పష్టం చేశారు.

ఇదే సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ప్రియాంక గాంధీ సమక్షంలోనే వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. కాగా ఇప్పుడు సభ వాయిదా పడటంతో.. వారంతా మరో తేదీని ఖరారు చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories