సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసుల తనిఖీలు

Railway Police Checks at Secunderabad Railway Station
x

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసుల తనిఖీలు

Highlights

Secunderabad: ఆగస్టు 15 సందర్భంగా తనిఖీలు చేపడుతున్నట్టు వెల్లడి

Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆజాది కా అమృత్ మహోత్సవాలు, ఆగస్టు 15 సందర్భంగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంతో పాటు అన్ని ప్లాట్‌ఫామ్స్‌, ప్రవేశ మార్గాలను తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులు, సూటుకేసులతో పాటు వారి వద్ద ఉన్న లగేజీని డాగ్ స్వ్కాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కపిపించిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేందుకు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తనిఖీలు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories