Rahul Gandhi: తెలంగాణలో రెండు రోజుల పాటు రాహుల్ పర్యటన

Rahul Visit to Telangana for Two Days
x

Rahul Gandhi: తెలంగాణలో రెండు రోజుల పాటు రాహుల్ పర్యటన

Highlights

Rahul Gandhi: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్‌

Rahul Gandhi: తెలంగాణలో రెండు రోజుల పాటు రాహుల్ పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. ఇవాళ కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లో రాహుల్ సభలు ఉండగా..రేపు మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌లో రాహుల్ ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2.30కి కల్వకుర్తి సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.30కి జడ్చర్లలో కార్నర్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం షాద్ నగర్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అనంతరం షాద్ నగర్ మీటింగ్‌లో యువనేత ప్రసంగించనున్నారు.

కాగా నిన్న రాత్రి శంషాబాద్ నోవోటల్ లో రాహుల్ గాంధీతో ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే, పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రంలో తాజా పరిస్థితిని రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories