Rahul Gandhi: తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం

Rahul Gandhi Speech At Bhupalpally
x

Rahul Gandhi: తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం

Highlights

Rahul Gandhi: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయి

Rahul Gandhi: దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరం అవుతూ వచ్చారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగిందని, ఆ అవినీతిని పక్క రాష్ట్రాలకు విస్తరించారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం..కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయని, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేసీఆర్‌ అవినీతిపై దర్యాప్తు సంస్థలు ఎందుకు ఫోకస్ చేయడం లేదని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే పనిచేస్తున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories