Rahul Gandhi: ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ సింహగర్జన

Rahul Gandhi Comments On KCR And BJP Parties In Khammam Sabha
x

Rahul Gandhi: ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ సింహగర్జన

Highlights

Rahul Gandhi:రాష్ట్రాన్ని కేసీఆర్ దోచేస్తున్నారని రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi: దక్షిణాదిలో కర్ణాటకతో ఖాతా తెరిచిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. గడిచిన రెండేళ్లుగా బీఆర్ఎస్‌పై పోరుకు సై అంటే సై అన్న బీజేపీ ప్రస్తుతం సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ సైతం బలంగా ఉండటంతో ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టెన్‌జన్‌పథ్ వ్యూహరచన చేస్తోంది.

భారత్ జోడో యాత్రతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన రాహుల్ గాంధీ... ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీని అధికారంలోకి తేవచ్చన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. స్టేట్ కేడర్‌ ఉన్న తన ప్రత్యేక టీంతో సర్వేలు చేయిస్తూ... ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి ప్రెసిడెంట్ ఖర్గే ద్వారా సూచనలు చేయిస్తున్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణపై ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ. పార్టీలో చేరికలు మొదలుకొని...సామాజిక వర్గాల వారిగా ఎవరికి టికెట్లు కేటాయిస్తే బీఆర్ఎస్‌ను ఎదుర్కొగలమన్న అంశాలపై రాహుల్ కసరత్తుల చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌లో సైతం కుమ్ములాటలున్నా.. ఎన్నికల వేళ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి విజయం దిశగా అడుగులు వేయించిన రాహుల్.. ఇప్పుడు అదే స్ట్రాటజీని తెలంగాణలో సైతం ఫాలో అవుతున్నారు.

హస్తిన కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో సైతం రాహుల్ నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎవరైనా మీడియాకు ఎక్కితే... ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా నాయకులను క్రమశిక్షణలో పెట్టి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడిచింది.

నాయకులను ఏకతాటిపైకి తేవడంలో రాహుల్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఖమ్మం సభ సక్సెస్ కావడమే అందుకు నిదర్శమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ బీ టీం అంటూ కాంగ్రెస్‌ వస్తున్న విమర్శలకు రాహుల్ గాంధీ ఖమ్మం సభ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్సే బీ టీం అంటూ విరుచుకుపడ్డారు. ఏదో నోటిమాటగా చెప్పకుండా రైతుబిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందంటూ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో బీజేపీతో పోరాడేది కాంగ్రెస్ మాత్రమేనని.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అండదండలు అందిస్తుందంటూ గర్జించారు.

రాహుల్ సభలో మాట్లాడుతుండగానే జనం పెద్ద ఎత్తున రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ధ్వజమెత్తుతూ... జనగర్జన సభను రాహుల్ తన గర్జన సభగా మర్చుకున్నారు. పథకాలపై పోరుతో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. ధరణిని పేరుతో కేసీఆర్ భూదోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్.

మొత్తంగా జనగర్జన సభలో రాహుల్ సింహ గర్జనే చేశారు. గ్యారెంటీ పథకాల ప్రకటన, నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం, కొత్తవారి చేరికలను ప్రోత్సహించడం వంటి పరిణామాలపై ఫోకస్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌‌కు రాహుల్ నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories