Kunduru Raghuveer Reddy: ఎంపీగా రఘువీర్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు విజయం

Raghuveer Reddy Record Victory As MP In Telugu States
x

Kunduru Raghuveer Reddy: ఎంపీగా రఘువీర్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు విజయం

Highlights

Kunduru Raghuveer Reddy: ఖమ్మం లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు

Kunduru Raghuveer Reddy: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు. ఖమ్మం లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల పార్లమెంట్‌ ఎన్నికల చరిత్రలో నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ రెడ్డి రికార్డు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5.52 లక్షల భారీ మెజారిటీతో రఘువీర్‌ గెలిచారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఇంతకుముందు 2011లో కడప లోక్‌ సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ 5.43 లక్షల ఆధిక్యం సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును రఘువీర్‌ అధిగమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories